News December 24, 2024

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

image

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. అటు TGలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

Similar News

News January 14, 2026

NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

image

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.

News January 14, 2026

పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

image

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్‌ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.