News May 26, 2024

ఉదయం 9 గంటలకే స్కూళ్లు

image

TG: ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉ.9 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు సా.4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సా.4.15 గంటల వరకు నిర్వహిస్తారు. గతేడాది ఉ.9.30 నుంచి స్కూళ్లు ప్రారంభం కాగా.. ఇప్పుడా నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉ.9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. HYD, SECలో మాత్రం ఉ.8.45 నుంచి సా.3.45 వరకే స్కూళ్లు ఉంటాయి.

Similar News

News October 31, 2025

మావోయిస్టు డంపుల్లో 400 కిలోల గోల్డ్?

image

మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. ఆ ఫండ్‌ను కొవిడ్ టైమ్‌లో బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్ల కంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 KGల గోల్డ్ ఉండొచ్చని అనుమానిస్తోంది.

News October 31, 2025

సబ్జా గింజలతో కురులకు బలం

image

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News October 31, 2025

పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

image

బ్రూసిల్లా అబార్టస్‌ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్‌. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.