News February 23, 2025
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.
News February 23, 2025
వరుసగా 2 ఓవర్లలో 2 వికెట్లు

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రమాదకరంగా మారిన రిజ్వాన్, షకీల్‌లను మనోళ్లు వెనక్కి పంపారు. వారిద్దరూ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్, హార్దిక్ వేసిన వరుస ఓవర్లలో ఔటయ్యారు. 2 క్యాచులు మిస్ అయినా పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం పాక్ స్కోర్ 35 ఓవర్లలో 160/4గా ఉంది.
News February 23, 2025
కాంగ్రెస్‌కు శశి థరూర్ రాం రాం చెబుతారా?

శశి థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల థరూర్.. మోదీ అమెరికా పర్యటన, కేరళలో పినరయి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేరళలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని, లేదంటే మరోసారి విపక్ష స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తనకు ‘ఆప్షన్లు’ ఉన్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.