News July 11, 2024

అధిక ఫీజు వసూళ్లు.. తిరిగిచ్చేయాలని స్కూళ్లకు ఆదేశాలు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఫీజులు వసూళ్లు చేసిన ప్రైవేట్ పాఠశాలలకు షాకిచ్చింది. జబల్‌పూర్‌లోని పలు పాఠశాలలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులతో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. 2018-2024 మధ్య కాలంలో 10 పాఠశాలలు 81 వేల మంది విద్యార్థుల నుంచి రూ.64.58 కోట్ల ఫీజులు అక్రమంగా వసూలు చేసినట్లు తేల్చింది. దీంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని ఆయా స్కూళ్లకు నోటీసులిచ్చింది.

Similar News

News November 15, 2025

బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

image

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

గత 6ఏళ్లలో FDIల సాధనలో AP వెనుకబాటు

image

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ సాధనలో 2019 OCT-2025 JUN మధ్య కాలంలో AP బాగా వెనుకబడింది. ఆ కాలంలో $1.27B FDIలతో ఏపీ 14వ స్థానానికి పరిమితమైంది. దేశ FDIలలో ఏపీ వాటా 0.2%-0.7% కాగా కర్ణాటక 14%-28% TN 3.7%-10% దక్కించుకున్నట్లు బిజినెస్ టుడే పేర్కొంది. 2025 జూన్‌ క్వార్టర్లో AP $307 M, కర్ణాటక $10 B, TG $2.3 B FDIలు సాధించాయి. కాగా VSP CII సమ్మిట్‌లో వచ్చిన 13L CR పెట్టుబడుల్లో FDIలూ ఉన్నాయి.

News November 15, 2025

Where is my Train యాప్ సృష్టికర్త ఇతడే!

image

ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్‌లలోనే గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం. కానీ ‘Where is my Train’ యాప్ వచ్చాక లైవ్ స్టేటస్‌ను తెలుసుకోగలుగుతున్నాం. ‘సిగ్మాయిడ్ ల్యాబ్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను 2018లో గూగుల్ కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మొహైదీన్ తన టీమ్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ ₹320 కోట్లు దాటింది. మీరూ ఈ యాప్ వాడతారా?