News August 31, 2024
స్కూళ్లకు సెలవు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

AP: భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పలుచోట్ల ప్రైవేట్ స్కూళ్లు సెలవులు ఇవ్వడం లేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. ప్రైవేట్ విద్యాసంస్థలూ తమ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందురోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు. <<13985236>>ఉప్పలపాడు <<>>ఘటనలో స్కూలుకు సెలవు ఇవ్వలేదా అని CM అడగ్గా, మధ్యాహ్నం తర్వాత ఇచ్చారని అధికారులు బదులిచ్చారు.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


