News June 26, 2024
నేడు తెలంగాణలో స్కూళ్ల బంద్

తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Similar News
News January 16, 2026
రొమాన్స్కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
News January 16, 2026
IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <
News January 16, 2026
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా!

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.


