News October 16, 2025
UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్‌షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్‌లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.
Similar News
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్‌ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
News October 16, 2025
5,346 టీచర్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఢిల్లీలో 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు DSSSB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/
News October 16, 2025
వేపాకుల కండిషనర్‌తో చుండ్రుకు చెక్

అమ్మాయిలకు జుట్టే అందం. ఒత్తయిన వెంట్రుకల కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఇంట్లోనే వేపాకులతో తయారుచేసుకున్న హెయిర్ కండిషనర్ మేలంటున్నారు నిపుణులు. ‘వేపాకులను నీళ్లలో మరిగించి గుజ్జుగా చేసి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడమూ తగ్గుతుంది’ అని చెబుతున్నారు.<<-se>>#HairCare<<>>