News January 4, 2025
శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1975, 1998 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పనిచేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
Similar News
News January 6, 2025
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్స్‌తో యువకులు
ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా సిగ్నల్స్ వద్ద పోలీసులు ఉండటం చూస్తుంటాం. కానీ, వియత్నాంలో సిగ్నల్స్ వద్ద యువకులు మొబైల్స్ పట్టుకొని అలర్ట్‌గా ఉండటాన్ని చూశారా? అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి ఫొటోలను క్లిక్ చేసి పోలీసులకు పంపించడాన్ని కొందరు ఆదాయంగా మలుచుకున్నారు. ఇలా చేస్తే విధించిన జరిమానాలో 10శాతాన్ని బౌంటీగా వారికి పోలీసులు అందిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News January 6, 2025
ఆ విషయం PMతో లోకేశ్ చెప్పించగలరా?: అమర్నాథ్
AP: ఏ శాఖ మీదా అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేశ్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. PM మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ YCP హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని PMతో లోకేశ్ చెప్పించగలరా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.
News January 6, 2025
HMPV వైరస్: స్టాక్ మార్కెట్లు క్రాష్
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.