News November 7, 2024

కాంగ్రెస్ పతనానికి 3 కారణాలు చెప్పిన సింధియా

image

కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ‘ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పట్టు తప్పింది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం మొదటిది. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం రెండోది. భారతదేశ విజన్‌కు దూరమవ్వడం మూడోది. ఈ మూడూ లేనప్పుడు పార్టీని ప్రజలు నమ్మడం మానేస్తారు. ప్రస్తుతం దాని దుస్థితి ఇదే’ అని అన్నారు. 2020లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.

Similar News

News November 22, 2025

ములుగు: సీక్రెట్ కోడ్‌తో గంజాయి విక్రయం..!

image

జిల్లాలో యువత గంజాయి మత్తులో ఊగుతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి గంజాయి విచ్చలవిడిగా రవాణా అవుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో పాన్ షాపులు, చిన్న కిరాణ దుకాణాల్లో సీక్రెట్ కోడ్ ఉపయోగించి అమ్మకాలు సాగిస్తున్నారని సమాచారం. బ్రాండ్ పేరు చెప్పకుండా “సిగరెట్” అనగానే గంజాయి నింపి ఉన్న సిగరెట్లను చేతికి ఇస్తున్నారట. దీనిపై పోలీసులు నిఘా పెట్టినప్పటికీ అసలైన సూత్రధారి దొరకడం లేదట.

News November 22, 2025

‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

image

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్‌ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 22, 2025

ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.