News March 29, 2025

17 ఏళ్లుగా మహిళ కడుపులోనే కత్తెర!

image

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. యూపీలోని లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. ఇన్నేళ్లుగా కడుపు నొప్పి వస్తుండటంతో KGMU ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయించడంతో అసలు విషయం బయటపడింది.

Similar News

News December 5, 2025

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>జూలాజికల్ <<>>సర్వే ఆఫ్ ఇండియా 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(జువాలజీ/వైల్డ్ లైఫ్ సైన్స్/ఎకాలజీ/లైఫ్ సైన్సెస్/ఆంథ్రోపాలజీ), PhD, MA(ఆంథ్రోపాలజీ/సోషల్ సైన్సెస్/హిస్టరీ/ఎకనామిక్స్/ఫిలాసఫీ ఉత్తీర్ణులు అర్హులు. Sr ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.57వేలు+HRA, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.35వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://zsi.gov.in

News December 5, 2025

నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

image

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.