News August 14, 2024

అవసరమైతే నన్ను తిట్టండి: మమతా బెనర్జీ

image

కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటనలో అన్ని చర్యలు తీసుకున్నా తమపై దుష్ప్రచారం జరుగుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అవసరమైతే తనను తిట్టొచ్చని, కానీ బెంగాల్‌ని దూషించొద్దని కోరారు. కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, సీపీఐ బంగ్లాదేశ్ తరహాలో నిరసనలకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.

Similar News

News January 20, 2025

సంజయ్ రాయ్‌కి నేడు శిక్ష ఖరారు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News January 20, 2025

రద్దీగా మారిన హైదరాబాద్

image

నేటి నుంచి ఆఫీస్‌లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్‌లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.

News January 20, 2025

ప్రభుత్వం సర్వే.. ఇళ్లు లేని కుటుంబాలు 30.29 లక్షలు

image

TG: ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 30.29 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవని తేలింది. వీటిలో 18.68 లక్షల ఫ్యామిలీలకే సొంత స్థలం ఉంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఆర్థిక సాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడతలవారీగా రూ.5లక్షల చొప్పున మంజూరు చేయనుంది.