News July 2, 2024

విపత్తు నిర్వహణ విభాగం పరిధిని విస్తరించాలి: సీఎం

image

TG: హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ORR వరకు పెంచాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. GHMC, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీల వరకు సేవల్ని విస్తరించాలన్నారు. ఈ విభాగానికి హైడ్రాగా(HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) పేరు పెట్టాలని నిర్ణయించారు. డీఐజీ, SP స్థాయి అధికారులు హైడ్రా పర్యవేక్షణ బాధ్యతలు చూడాలన్నారు.

Similar News

News October 12, 2024

ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర

image

AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News October 12, 2024

కాళీ దేవి కిరీటం చోరీని ఖండించిన భారత్

image

బంగ్లాదేశ్‌లోని ఓ ఆలయంలో PM మోదీ స‌మ‌ర్పించిన‌ కాళీ దేవి కిరీటం చోరీకి గురైన ఘటనను భార‌త్ ఖండించింది. దీన్ని ఉద్దేశ‌పూర్వకంగా చేసిన అప‌విత్ర చ‌ర్య‌గా పేర్కొంది. తాంతిబ‌జార్‌లోని పూజా మండ‌పంపై దాడి, స‌త్ఖిరాలోని జేషోరేశ్వ‌రి కాళీ ఆల‌యంలో చోరీ ఘ‌ట‌న‌ల‌ను ఆందోళ‌న‌క‌ర చ‌ర్య‌లుగా గుర్తించిన‌ట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న‌ ఈ ఘ‌ట‌న‌లు శోచ‌నీయ‌మని పేర్కొంది.

News October 12, 2024

దసరా ఎఫెక్ట్.. జోరుగా మద్యం విక్రయాలు

image

దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత 5 రోజుల్లో విక్రయాలు 25శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సగటున రూ.1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలింది. ఇక ఈనెల 1 నుంచి 8 వరకు మొత్తం రూ.852.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.