News November 21, 2024
కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్‌ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.
Similar News
News December 11, 2025
394 పోస్టులకు UPSC నోటిఫికేషన్

UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్(MPC) ఉత్తీర్ణులైనవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్సైట్: https://upsc.gov.in/
News December 11, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పేరిట ‘సైబర్’ వల.. జాగ్రత్త: సజ్జనార్

TG: బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసం RBI తెచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్‌ను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారని HYD CP సజ్జనార్ తెలిపారు. డబ్బులు ఇప్పిస్తామంటూ నకిలీ లింకులు పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, అధికారిక సైట్‌ను (udgam.rbi.org.in) మాత్రమే వాడాలని సూచించారు. ‘RBI OTPలు, పాస్వర్డ్లు అడగదు. మోసపోతే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని కోరారు.
News December 11, 2025
పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.


