News February 3, 2025
SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
Similar News
News September 19, 2025
20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.
News September 19, 2025
పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్‌ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.