News February 3, 2025
SCRలో ఉద్యోగం.. ఈ రోజే లాస్ట్!

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అలర్ట్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
Similar News
News December 9, 2025
టెట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి: రెవెన్యూ అధికారి

జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 10 నుంచి ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.
News December 9, 2025
క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.


