News March 29, 2025

SCRలో 92 మంది పదవీ విరమణ

image

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్‌ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్‌ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్‌షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News April 5, 2025

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

image

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.

News April 5, 2025

HYD: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మహత్య

image

HYDలో విషాదం నెల‌కొంది. క‌వాడిగూడ‌లోని సీసీజీవో ట‌వ‌ర్స్‌లోని 8వ అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఓ అధికారిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

News April 5, 2025

రాజేంద్రనగర్‌: మంచి దిగుబడినిచ్చేది ఆముదం ఐసీహెచ్‌-5

image

తక్కువ నీరు ఉన్నా అధిక దిగుబడులు సాధించేలా ఆముదం ఐసీహెచ్‌-5 రకం విత్తనాన్ని అభివృద్ధి చేశామని ఐసీఎఆర్‌-ఐఐఓఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కె.మాధుర్‌ పేర్కొన్నారు. శుక్రవారం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మాట్లాడుతూ.. ఈ సంకర జాతి విత్తనం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలదన్నారు. ఎకరాకు 5-6 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి ఇస్తుందన్నారు.

error: Content is protected !!