News March 29, 2025
SCRలో 92 మంది పదవీ విరమణ

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్‌షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దమనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News April 1, 2025
HYD: ఏప్రిల్ 3న కొత్త ఎక్సైజ్ స్టేషన్స్ ప్రారంభం

HYD: కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. గండిపేట, అమీన్పూర్ ఎక్సైజ్ స్టేషను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 13 వరంగల్ రూరల్‌లో ఒక కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏప్రిల్ 1న బదులు ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3న కొత్త స్టేషన్లు ప్రారంభించడానికి రాష్ట్ర ఎక్సైజ్ నిర్ణయం తీసుకుంది.
News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.