News April 8, 2025
SDC మృతి తీరని లోటు: కలెక్టర్

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమ మృతి అత్యంత బాధాకరమని, రెవిన్యూ శాఖకు తీరని లోటని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. జేసీ రాజేంద్రన్, DRO మధుసూదన్ రావు, RDO శ్రీనివాస్‌తో కలసి SDC రమ భౌతిక కాయనికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. SDC రమ అంకితభావంతో పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు.
Similar News
News April 19, 2025
ఆ లిస్టులో సెకండ్ ప్లేస్‌కు పాటీదార్

నిన్న పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్ IPLలో తక్కువ ఇన్నింగ్స్(30)లో 1,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో 25 ఇన్నింగ్స్‌లతో GT ప్లేయర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. సచిన్, రుతురాజ్ 3వ స్థానంలో ఉన్నారు. కాగా, ఈ ఏడాది RCBకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాటీదార్ 7మ్యాచుల్లో 209 రన్స్ చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నారు.
News April 19, 2025
సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్‌కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 19, 2025
మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.