News April 8, 2025

SDC మృతి తీరని లోటు: కలెక్టర్

image

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమ మృతి అత్యంత బాధాకరమని, రెవిన్యూ శాఖకు తీరని లోటని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. జేసీ రాజేంద్రన్, DRO మధుసూదన్ రావు, RDO శ్రీనివాస్‌తో కలసి SDC రమ భౌతిక కాయనికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. SDC రమ అంకితభావంతో పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు.

Similar News

News April 17, 2025

శంఖవరం: చెప్పులు దండ వేసిన నిందితుడు అరెస్ట్

image

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.నిందితుడి పేరు పడాల వాసు(20) అని అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు,10మంది ఎస్సైలు ,40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ వారిని అభినందించారు.

News April 17, 2025

KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.

News April 17, 2025

ఏలూరు: నేరం రుజుకావడంతో 5 ఏళ్ల జైలు

image

ఏలూరుకు చెందిన కాటుమల రవితేజ, దుర్గలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త తాగుడుకు బానిసై, పాప తనకు పుట్టలేదని తరచూ గొడవ పడేవాడని భార్య తెలిపింది. 2018 సెప్టెంబర్ 1న పాపను కడుపులో బలంగా తండ్రి తన్నడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, నేరం రుజువు కావడంతో 5 ఏళ్ల జైలు శిక్ష బుధవారం విధించినట్లు ఎస్పీ కిషోర్ తెలిపారు.

error: Content is protected !!