News June 28, 2024
SDNR: పరిశ్రమలో పేలుడు.. భయానక దృశ్యాలు

షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. కంప్రెషర్ పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కచోట ఎగిరిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మిక నేత తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందగా పలువురు షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 21, 2025
నవాబుపేట: కూతురి ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆత్మహత్య

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 20, 2025
MBNR: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ఎన్నికల కమిషనర్

త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రీయ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి సిఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
News November 20, 2025
ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో కబడ్డీ జట్ల ఎంపికలు

ఈనెల 23వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో స్త్రీ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శాంత కుమార్, కురుమూర్తి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలన్నారు. పురుషులు బరువు 85 కిలోల లోపు, స్త్రీలు 75 కిలోల లోపు ఉండాలన్నారు.


