News June 28, 2024

SDNR: పరిశ్రమలో పేలుడు.. భయానక దృశ్యాలు

image

షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. కంప్రెషర్ పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కచోట ఎగిరిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మిక నేత తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందగా పలువురు షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News December 21, 2024

కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్

image

బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.

News December 21, 2024

MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 21, 2024

కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్

image

మహబూబ్‌నగర్ పట్టణం ఇక అప్‌గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.