News September 21, 2024
SDNR: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడినట్లు షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామపంచాయతీలోని గుండ్యా తండాకు చెందిన జటావత్ రమేశ్ చెడు వ్యసనాలకు అలవాటు పడి భార్య లలిత(30)ను 2020 అక్టోబర్ 26న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు రమేశ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 11, 2024
కురుమూర్తి టెంపుల్‌కి ఘాట్ రోడ్డు సంతోషకరం: మంత్రి కోమటిరెడ్డి
కలియుగ దైవంగా కురుమూర్తి దేవస్థానాన్ని భావించి లక్షలాది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2009లో ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
News November 10, 2024
పదేళ్లుగా పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు: రేవంత్
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పరిశ్రమలు రాలేదు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతున్నాయి. ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రేవంత్ తెలిపారు.
News November 10, 2024
సుప్రసిద్ధ కేంద్రంగా కురుమూర్తిని మారుస్తాం: సీఎం
ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. చరిత్రలోనే తొలిసారిగా కురుమూర్తి దేవస్థానానికి ముఖ్యమంత్రి రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో కురుమూర్తి దేవస్థానాని దేశంలో సుప్రసిద్ధ పర్యటక కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.