News January 4, 2025
SDPT: రోడ్డు భద్రతపై ప్రజలు చైతన్యం కావాలి: మంత్రి పొన్నం
రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News January 8, 2025
మెదక్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలసి వీసీ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు.. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు.
News January 8, 2025
మెదక్: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
News January 8, 2025
పటాన్చెరు: బైక్లో చున్నీ ఇరుక్కొని మహిళ మృతి
బైక్లో చున్నీ చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన అమీన్పూర్లో నిన్న జరిగింది. పటాన్చెరు డివిజన్లోని జీపీ కాలనీకి చెందిన నవదీప్ దూలపల్లిలో MCA చేస్తున్నాడు. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్కు తల్లి రజితను బైక్పై తీసుకెళ్తుండగా ఆమె చున్ని బైక్ టైరులో చిక్కుకొని కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైనట్లు SI దుర్గయ్య తెలిపారు.