News January 4, 2025
SDPT: రోడ్డు భద్రతపై ప్రజలు చైతన్యం కావాలి: మంత్రి పొన్నం
రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News January 25, 2025
మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ- ఆఫీస్ అమలు: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ- ఆఫీస్ కార్యక్రమానికి శ్రీకారం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పేపర్‌పై పని తగ్గించాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో విద్యుత్‌ను ఆదా చేసి ఈ- ఆఫీస్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News January 24, 2025
మెదక్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల ద్వారా శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడానికి ఇవాళ వరకు జాబితా ఇవ్వాలని సూచించారు.
News January 24, 2025
ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.