News October 14, 2025
SDPT: ఈ నెల 16,17న జిల్లా స్థాయి సెలక్షన్

సిద్దిపేట జిల్లా ఆత్య పత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆత్య, పత్య జూనియర్ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి బుస్స మహేష్ తెలిపారు. ఈ నెల 16,17తేదీలలో చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటిల్లో పాల్గొనాలని సూచించారు.
Similar News
News October 14, 2025
5 ఛానళ్లను మూసివేస్తున్న MTV

90’s, 2000’sలో సంగీత ప్రియులను అలరించిన TV మ్యూజిక్ ఛానల్ MTV బ్రాడ్ కాస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31కల్లా MTV మ్యూజిక్, 80’s, 90’s, క్లబ్, లైవ్ ఛానళ్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఆడియన్స్ యూట్యూబ్, టిక్ టాక్, స్పాటిఫై వంటి ఇతర వేదికలకు మళ్లడంతో ఈ ఛానళ్లకు డిమాండ్ తగ్గినట్లు వెల్లడించింది. అయితే MTV ఛానెల్ మాత్రం ఉంటుందని తెలిపింది.
News October 14, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ NOV 18కి వాయిదా

TG ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ‘ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్’ చేయాలని ప్రభాకర్‌ను ఆదేశించింది. కాగా అతడి మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది.
News October 14, 2025
అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.