News December 15, 2025

SDPT: కేసీఆర్ స్వగ్రామంలో ఎవరూ గెలిచారంటే!

image

మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామంలో BRS హావ కొనసాగింది. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి మోత్కు సుమలత శంకర్ 883 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. మరోసారి చింతమడక ప్రజలు BRSకు ఓట్లు వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు.

Similar News

News December 15, 2025

కాశీబుగ్గ: 600 ఖాళీలకు..జాబ్ మేళా

image

కాశీబుగ్గలోని శ్రీ సాయి శీరిషా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈనెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆయా కంపెనీల్లోని ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ITI చదివిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు.

News December 15, 2025

వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

image

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 15, 2025

జనవరిలో భారీ ఓపెనింగ్స్.. ప్రిపేర్ అవ్వండి!

image

డిసెంబర్ ‘డ్రై మంత్’ ముగియగానే జనవరిలో ఐటీ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇయర్ ఎండ్ ఆడిట్‌లు, బడ్జెట్ ప్రణాళికలు పూర్తవడంతో డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఆగిపోతాయి. జనవరి ఓపెనింగ్స్ కోసం HR టీమ్స్ ప్లాన్ చేసుకుంటాయి. రాబోయే నోటిఫికేషన్‌లు, లక్ష్యంగా చేసుకోవాల్సిన కంపెనీలపై ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉండాలి’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. SHARE IT