News December 19, 2025
SDPT: పంచాయతీ ఎన్నికల కిక్కు.. రూ.69.95 కోట్ల అమ్మకాలు

ఓ వైపు పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో జిల్లాలో లిక్కర్ అమ్మకాలు భారీగా కొనసాగాయి. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో మద్యం విక్రయాలు మత్తెక్కించాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.69.95 కోట్ల విలువ 74,678 కేసుల లిక్కర్,79,828 కేసుల బీర్ల విక్రయాలు సాగాయి. ఈ వారం రోజులపాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్టు చర్చించుకుంటున్నారు.
Similar News
News December 19, 2025
జంట పేలుళ్ల దోషుల శిక్ష రద్దు పిటిషన్‌పై HC విచారణ

TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల దోషులకు HC ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. ఆరోగ్య, మానసిక స్థితి, పశ్చాత్తాప భావనను పరిగణించి మరణశిక్ష రద్దు చేయాలని నేరస్థులు పిటిషన్ వేశారు. తమ విచారణను మరో బెంచ్‌కు మార్చాలని కోరారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. 2007లో HYD జంట పేలుళ్లతో 46మంది చనిపోయారు. ఈ కేసులో MHకు చెందిన అనిక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లకు 2018లో ఉరిశిక్ష పడింది.
News December 19, 2025
సైబర్ గిఫ్ట్ లింకులతో జాగ్రత్త: ఎస్పీ సునీల్ షొరాణ్

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్‌ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News December 19, 2025
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.


