News March 3, 2025

SDPT: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News July 4, 2025

NZB: రెండు రోజుల పసికందు విక్రయం

image

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.

News July 4, 2025

కామారెడ్డి జిల్లాలో చేపల వేటపై నిషేధం

image

కామారెడ్డి జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సంఘాల పరిధిలోని 100 ఎకరాల ఆయకట్టు పైన, లోబడి ఉన్న చెరువులు ఎవరికీ కౌలుకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన సంఘాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జులై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని అన్ని చెరువులు, రిజర్వాయర్, కుంటలలో చేపల వేటను నిషేధించామన్నారు.

News July 4, 2025

శ్రీ సత్యసాయి: పడిపోయిన వెల్లుల్లి ధరలు

image

ఈ ఏడాది ఆరంభం నుంచి వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రెండు వారాలుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిలో రూ.400 వరకు పలికిన వెల్లుల్లి ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వెల్లుల్లి సాగు చేసిన రైతులు డీలపడ్డారు. ధరలు పెరగడం వల్ల ప్రజలు, ఉన్నఫలంగా ధర అట్టడుగు స్థాయికి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.