News September 10, 2025
SDPT: స్థానిక ఎన్నికలు.. ఆశావాహుల్లో ఖర్చుల బుగులు

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావాహుల్లో ఖర్చుల బుగులు పట్టుకుంది. కొన్ని గ్రామాల్లో ఆశావాహులు స్థానికులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కొందరు ఎన్నికల తేదీ రాకముందే ఇప్పటినుండే ఖర్చు చేస్తే ఎలా అని సందిగ్ధంలో పడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముగ్గు చూపడంతో ఎన్నికల ఆలస్యం ఆశావాహులను కలవరపెట్టింది.
Similar News
News September 10, 2025
నర్సాపూర్(జీ): నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం!

నర్సాపూర్(జీ)కి చెందిన ఓ వ్యక్తి 2018లో విదేశాల్లో మరణించగా.. గ్రామ పంచాయతీ అధికారులు 2019లో అతడు స్థానికంగానే మరణించినట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. విదేశాల్లో మృతి చెందిన వారికి విదేశాంగ శాఖ మాత్రమే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు ఇలా తప్పుడు పత్రం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
News September 10, 2025
భద్రాద్రి: పల్లె ప్రకృతి వనాలు.. పశువులకు నిలయాలు!

అళ్లపల్లి మండలం మైలారం పాఠశాల పక్కన లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదెల మేతకు నిలయంగా మారింది. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వనంలో చెట్లు నాశనమవుతున్నాయి. అధికారులు వెంటనే దీని చుట్టూ కంచె ఏర్పాటు చేసి మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
News September 10, 2025
అనంతపురం చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురానికి చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్, మంత్రులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. 15 నెలల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను వివరించనున్నారు. ఈ సభకు లక్షలాది మంది తరలిరావడంతో ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది.