News November 4, 2024
విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’.. 9న ప్రయోగం

AP: విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ జర్నీకి ఈ నెల 9న CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ 2 ప్రాంతాల మధ్య దీన్ని నడిపేందుకు ఉన్న అనుకూలతలపై అధికారులు తొలుత ప్రయోగం నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. దీనివల్ల పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుందని భావిస్తున్నారు.
Similar News
News December 2, 2025
NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


