News March 5, 2025

SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

image

TG: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Similar News

News December 1, 2025

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

image

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.

News December 1, 2025

ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

image

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.