News February 12, 2025

శెభాష్ పోలీస్.. నిమిషాల్లో ప్రాణం కాపాడారు!

image

AP: ఆర్థిక ఇబ్బందులతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేయగా పోలీసులు అతణ్ని కాపాడి శెభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి CI భీమరాజుకు ఫిర్యాదు రావడంతో లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న SI శ్రీహరికి సమాచారమిచ్చారు. వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేశారు. ఉరేసుకునేముందు వారు తలుపు నెట్టి కాపాడారు. ఇదంతా 6 నిమిషాల్లోనే జరగడం విశేషం.

Similar News

News February 12, 2025

Gold Bars అమ్మకాలు నిలిపివేత.. ఎక్కడంటే!

image

బంగారం ధరలు పెరుగుతున్న వేళ సౌత్ కొరియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడి మింటింగ్ కార్పొరేషన్ గోల్డ్‌బార్స్ అమ్మకాలను నిలిపివేసింది. Feb 11న కమర్షియల్ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని ముడిసరుకు సేకరించడం కష్టంగా మారింది. అందుకే గోల్డ్ బార్స్ అమ్మకాలు ఆపేశాం. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు’ అని పేర్కొంది. ప్రస్తుతం Hydలో గోల్డ్ 10gr ధర రూ.87k ఉంది.

News February 12, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.

News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

error: Content is protected !!