News February 27, 2026

SEBIలో 91 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<>SEBI<<>>)లో 91 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి PG, MBA, CA, CMA, CFA, LLB, PhD, BE/BTech, MCA/MSc/MTech అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.70వేలు చెల్లిస్తారు. అప్లికేషన్ స్క్రీనింగ్, ప్రిలిమినరీ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.sebi.gov.in

Similar News

News April 14, 2026

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 14, 2026

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News April 14, 2026

3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

image

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.