News July 27, 2024

విజయ్ మాల్యాపై సెబీ నిషేధం

image

విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు సెబీ మరో షాక్ ఇచ్చింది. భారత సెక్యూరిటీ మార్కెట్‌లో (స్టాక్స్, బాండ్స్ మొదలైనవి) ట్రేడింగ్ చేయకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా భారత మార్కెట్‌లోకి నిధులు మళ్లించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2006-2008 మధ్య మాల్యా ఈ అవకతవకలకు పాల్పడ్డారు. కాగా ఇలాంటి కేసులోనే 2018-2021 మధ్య కూడా సెబీ మాల్యాపై బ్యాన్ విధించింది.

Similar News

News April 2, 2026

లేటుగా సూర్యోదయం.. త్వరగా సూర్యాస్తమయం!

image

TG: పెద్దపల్లి జిల్లా కొదురుపాక గ్రామం అరుదైన ప్రకృతి వింతకు నిలయం. ఈ ఊరికి నలువైపులా ఎత్తైన కొండలు ఉండటంతో ఇక్కడ 4PMకే చీకటి అలుముకుంటుంది. అందుకే దీనిని ‘మూడు జాముల కొదురుపాక’ అని పిలుస్తుంటారు. తూర్పున ఉన్న కొండల వల్ల సూర్యోదయం కూడా ఆలస్యంగానే అవుతుంది. ఈ వింతపై కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా తెరకెక్కడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (36/100)

News April 2, 2026

వితంతువు తన మామ నుంచీ భరణం కోరవచ్చు: హైకోర్టు

image

భార్యను పోషించడం భర్త బాధ్యతని, అది అతడి మరణం తర్వాత కూడా ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. వితంతువు తన భర్త ఆస్తి నుంచి భరణం పొందవచ్చని, అది సరిపోకపోతే మామ నుంచీ కోరవచ్చని పేర్కొంది. భరణం కోసం తన భార్య తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందని, ఆమెపై విచారణ జరపాలని అకుల్ రస్తోగీ(UP) అనే వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో HCలో సవాలు చేయగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News April 2, 2026

మధ్యలో ఉండాలనే అమరావతి ఎంపిక: లోకేశ్

image

AP: అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై మద్దతిచ్చిన అందరికీ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 3 రాజధానుల పేరుతో జగన్ డ్రామా చేసినా, ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతికే మద్దతు పలికారని ఢిల్లీలో పేర్కొన్నారు. ఈ విజయం అక్కడి రైతులదేనన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలనే అమరావతిని ఎంపిక చేశామన్నారు. జగన్ చెప్పిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో తమ పార్టీ ఎంపీ అత్యధిక మెజారిటీతో గెలిచారన్నారు.