News August 11, 2024
‘హిండెన్‌బర్గ్’ ఆరోపణలను ఖండించిన సెబీ ఛైర్పర్సన్

అదానీ విదేశీ ఫండ్లలో తమకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ చేసిన <<13825523>>ఆరోపణలను<<>> సెబీ ఛైర్పర్సన్ మాధబీ పురీ బుచ్ ఖండించారు. ‘మా జీవితం, ఆర్థిక లావాదేవీలన్నీ తెరిచిన పుస్తకం. ఇప్పటికే ఆ వివరాలన్నీ సెబీకి సమర్పించాం. అధికారవర్గాలు కోరితే ఏ నివేదికనైనా వెల్లడిస్తాం. హిండెన్‌బర్గ్‌పై సెబీ చర్యలు తీసుకున్నందుకు ప్రతీకారంగా మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నించడం దురదృష్టకరం’ అని తెలిపారు.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్‌కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


