News June 20, 2024
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఇ-స్కూటర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా ₹5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (యాజమాన్యానికి చెందిన షేర్లు విక్రయించడం) ద్వారా ₹1750 కోట్లు రాబట్టాలని సంస్థ భావిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కేపెక్స్ పెంచేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 23, 2026
వృత్తులు చేస్తున్నారా? ఇలా చేస్తే నైపుణ్యం మీవెంట..

సరస్వతీ దేవిని ‘సకల కళా స్వరూపిణి’ అంటారు. అందుకే ఈ రోజున సంగీతకారులు తమ వాయిద్యాలను (వీణ, తబలా, వయొలిన్), చిత్రకారులు తమ కుంచెలను, డ్యాన్సర్స్ తమ గజ్జెలను పూజించాలి. దీనివల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. అలాగే వృత్తి పని వారు తమ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం వల్ల ఆ వృత్తిలో నైపుణ్యం పెరిగి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఏ రంగంలో అయినా ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ దినం ఒక వరం.
News January 23, 2026
అమెజాన్‌లో 16 వేల ఉద్యోగాల కోత!

అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ 30 వేల మందిని తొలగించనుందని గతేడాది అక్టోబర్‌లో రాయిటర్స్ తెలిపింది. ఈ క్రమంలో తొలి విడతలో 14 వేల మందిని ఆ కంపెనీ ఇంటికి పంపింది. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తమకు మేనేజర్లు హింట్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. 2023లోనూ 27 వేల మందిని అమెజాన్ తీసేసింది.
News January 23, 2026
మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


