News July 2, 2024

హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు

image

గతఏడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్‌లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.

Similar News

News October 20, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News October 20, 2025

‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

image

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్‌రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.

News October 20, 2025

DLS కంటే VJD మెథడ్ చాలా బెటర్: గవాస్కర్

image

IND, AUS మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో DLS మెథడ్‌పై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎప్పటి నుంచో ఉన్నా DLS గురించి చాలా మందికి తెలియదు. దీనికి బదులు ఇండియన్ కనిపెట్టిన <<18056102>>VJD<<>> మెథడ్ చాలా బెటర్. ఇరు జట్లకు అనుకూలంగా ఉంటుంది. BCCI డొమెస్టిక్ క్రికెట్లో ఈ పద్ధతిని అనుసరించింది’ అని అన్నారు. కాగా నిన్న IND 26 ఓవర్లలో 136 రన్స్ చేయగా DLS ప్రకారం టార్గెట్‌ను 131కి తగ్గించడం తెలిసిందే.