News November 22, 2024
అదానీ గ్రూప్పై విచారణ ప్రారంభించిన సెబీ!
అదానీ గ్రీన్ ఎనర్జీపై అమెరికా న్యాయ శాఖ ఆరోపణల నేపథ్యంలో SEBI విచారణ ప్రారంభించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ఛేంజీలకు అదానీ గ్రూప్ సమాచారం ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందా? అనే అంశంపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి వివరణ కోరినట్టు CNBC TV18 తెలిపింది. రెండు వారాలపాటు నిజనిర్ధారణ అనంతరం అధికారిక దర్యాప్తుపై నిర్ణయించనుంది.
Similar News
News November 23, 2024
తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్
తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 13 గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలు రానున్నాయి. ఒక్కో కాలేజీకి 60 మంది విద్యార్థులను తీసుకోనున్నారు. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరిలో కాలేజీలు ఏర్పాటుకానున్నాయి.
News November 23, 2024
చలి పులి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా పెరిగిపోయింది. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నీరు, పౌష్ఠికాహారం తీసుకోవాలి. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విటమిన్ C ఉండే ఫుడ్ తీసుకోవాలి. చలి మంట కోసం ఇంట్లో కర్రలు కాల్చకూడదు. ఇలా చేస్తే కార్బన్ మోనాక్సైడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
News November 22, 2024
రేపే ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలను వే2న్యూస్ యాప్లో వేగంగా చూడొచ్చు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నాన్-స్టాప్ కవరేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్స్, విశ్లేషణాత్మక స్టోరీలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉ.9 గంటల కల్లా ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.