News August 12, 2024
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన సెబీ

సంస్థ ఛైర్‌పర్సన్ మాధబీ బుచ్‌పై ఆరోపణలపై సెబీ తొలిసారి స్పందించింది. ‘అలాంటి నివేదికలపై స్పందించేముందు ప్రశాంతంగా ఉండి తగిన శ్రద్ధ వహించండి’ అని ఇన్వెస్టర్లకు సూచించింది. కాగా హిండెన్‌బర్గ్ నివేదిక రేపు భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మదుపర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 11, 2026
హంసలదీవి వేణుగోపాలస్వామి క్షేత్రం

కృష్ణాజిల్లా హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనది. పుట్టలో ఉన్న స్వామికి ఆవులు పాలు కార్చడం చూసి, గోపాలురు నిప్పు పెట్టగా స్వామి విగ్రహం భిన్నమైందని జనశృతి. ఆ విగ్రహం పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి, సాగర సంగమంలో స్నానమాచరిస్తే సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఆలయం 1977 ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి వేలాది మందిని కాపాడింది.
News February 11, 2026
పట్నా ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

బిహార్ పట్నాలోని <
News February 11, 2026
వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్

AP: వైసీపీ కుట్రలపై మూడు పార్టీలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభాపక్షం భేటీ అయింది. వైసీపీ విధ్వంస కుట్రలపై సభలో చర్చించాలని పవన్ పేర్కొన్నారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.


