News March 19, 2025
పలు పదవులకు SEC నోటిఫికేషన్

AP: మండల ప్రజా పరిషత్, 2 జిల్లా పరిషత్లు, పంచాయతీల్లో ఖాళీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీల్లో 214 ఉప సర్పంచ్లు, వైఎస్సార్ ZP ఛైర్పర్సన్, కర్నూలు ZP కోఆప్టెడ్ మెంబర్, MPPలలో 28 ప్రెసిడెంట్స్, 23 వైస్ ప్రెసిడెంట్స్, 12 కోఆప్టెడ్ మెంబర్ ఖాళీలున్నాయి. ఈ నెల 23లోగా సంబంధిత మెంబర్లకు నోటీసులు జారీ చేస్తామని, 27న ఎన్నిక నిర్వహిస్తామని SEC తెలిపింది.
Similar News
News March 19, 2025
శోభితలో నాకు నచ్చే విషయం ఇదే: చైతూ

తన భార్య శోభితలో తనకు నచ్చే విషయమేంటో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఆమె తెలుగు భాషా నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. మామ, మా కుటుంబసభ్యులు కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడంతో తమిళం నేర్చుకున్నా. ఇంట్లో ఇంగ్లిష్లో మాట్లాడతా. కాబట్టి నా తెలుగు ఆమెలా స్పష్టంగా ఉండదు. ఆమెనే నాకు నేర్పించాలి. తన తెలివితేటలనూ పంచాలని శోభితతో జోక్ చేస్తుంటా’ అని చైతూ చెప్పారు.
News March 19, 2025
స్పేస్లో ఉండటంతో సునీత వయసులో వ్యత్యాసం!

భూమిపైన ఉన్నవారి కంటే అంతరిక్షంలో ఉన్నవారి వయసు పెరుగుదల నెమ్మదిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ‘ISSలో ఆరు నెలలు గడిపిన తర్వాత వ్యోమగాములు భూమిపై ఉన్నవారితో పోల్చితే దాదాపు 0.005 సెకన్లు తక్కువగా ఉంటుంది’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో సునీత 9 నెలలు ISSలో ఉండటంతో ఆమె వయసులోనూ ఈ వ్యత్యాసం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
News March 19, 2025
17 మంది మృతి.. J&K ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్లో 3 కుటుంబాల్లోని 17 మంది అనుమానాస్పదంగా <<15242949>>మృతి చెందడంపై<<>> అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి శరీరాల్లో 6 రకాల విషపదార్థాలు(అల్యూమినియం, కాడ్మియం, ఆల్డికార్బ్ సల్ఫేట్, ఎసిటామిప్రిడ్, డైథైల్డిథియోకార్బమేట్, క్లోర్ఫెనాపైర్) ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. బాక్టీరియల్, వైరల్ సంబంధిత వ్యాధులుగా నిర్ధారణ కాలేదంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.