News January 6, 2025

ఈనెల 25లోపు రెండో విడత కాటమయ్య కిట్లు: మంత్రి

image

TG: కల్లు గీత కార్మికులకు రెండో విడతలో భాగంగా 10 వేల కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి కిట్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది జులై 14న రంగారెడ్డి (D) లష్కర్ గూడలో సీఎం రేవంత్ కాటమయ్య కిట్ల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 7, 2025

రాష్ట్ర ప్రభుత్వాల ‘ఆర్థిక పరిమితుల’పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

image

ఏ పనీ చేయని వ్యక్తులకు ఉచితాలు ఇవ్వడానికి రాష్ట్రాల వద్ద డబ్బులు ఉంటాయని, అదే జడ్జిలకు జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే పరిమితులపై మాట్లాడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఎన్నిక‌లొస్తే మ‌హిళ‌ల‌కు ₹2500 ఇస్తామంటూ ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తారు. వైవిధ్యమైన న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఏర్పర‌చాలంటే కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించడానికి న్యాయమూర్తుల ఆర్థిక స్వతంత్రత అనివార్యం’ అని జస్టిస్‌ గవాయ్ బెంచ్ పేర్కొంది.

News January 7, 2025

hMPV: ఆంక్షలు విధించిన తొలి జిల్లా

image

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కేసులతో నీలగిరి జిల్లా (TN) అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులున్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. దీంతో ప్రజల, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఫ్లూ లక్షణాలున్న వారు మాస్కు ధరించడాన్ని కలెక్టర్ తన్నీరు లక్ష్మీభవ్య తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వైలెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో తనిఖీలు చేస్తామన్నారు.

News January 7, 2025

ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం

image

AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవాళ నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని డిసైడ్ చేశారు. మరోవైపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.