News September 27, 2024
కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి పరీక్షల్లో వైరస్ పాజిటివ్గా తేలినట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్నది ఇంకా నిర్ధారణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేరళలోని మలప్పురంలో UAE నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలడంతో దేశంలోనే మొదటి కేసు నమోదైంది.
Similar News
News January 4, 2026
రేవంత్ నాలుక కోయాలి: హరీశ్ రావు

తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ‘కాంగ్రెస్, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం. సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ నాలుక కోయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించవచ్చు. అవసరమైతే హత్యాయత్నం చేయించవచ్చు’ అని కామెంట్ చేశారు.
News January 4, 2026
ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు

ఏపీలో జనవరిలో స్కూళ్లకు దాదాపు సగం రోజులు సెలవులే ఉంటాయి. ఇవాళ (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం. ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. దీంతో వారికి అదనంగా మరో 3 సెలవులు కలిపి ఈ మంత్లో 14 రోజులు హాలిడేస్ అన్నట్లు. తెలంగాణలో ఈ సంఖ్య 10-12 రోజులు.
News January 4, 2026
అఖండ2: OTT డేట్ ప్రకటించిన NETFLIX

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ2 OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఊహించినట్లుగానే ఈనెల 9న మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని రైట్స్ పొందిన NETFLIX ప్రకటించింది.


