News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News December 22, 2025

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా TIFFA సేవలు: మంత్రి సత్యకుమార్

image

APలోనే తొలిసారి 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో TIFFA స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆస్పత్రులు, ఒంగోలులోని MCH, పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రులకు అందించినట్లు చెప్పారు. ‘JAN 1 నుంచి ఉచిత సేవలు మొదలవుతాయి. ఈ స్కాన్‌తో 18-22 వారాల గర్భస్థ శిశువు లోపాలను కనుగొనవచ్చు. గర్భిణులకు ₹4K చొప్పున ఆదా అవుతుంది’ అని తెలిపారు.

News December 22, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన కృష్ణప్ప గౌతమ్

image

IPL క్రికెటర్, కర్ణాటక ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. IPLలో MI, RR, PBKS, LSG, CSK జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ 37 ఏళ్ల ఆల్‌రౌండర్ 36 మ్యాచుల్లో 247రన్స్, 21వికెట్స్ సాధించారు. 59 ఫస్ట్ క్లాస్, 68 లిస్ట్-A మ్యాచుల్లో కలిపి 320వికెట్లు తీశారు. రంజీలో(2016-17) 8 మ్యాచుల్లో 27W, 2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్-2019లో 56 బంతుల్లో 134 రన్స్ చేయడం ఆయన కెరీర్‌కే హైలైట్.

News December 22, 2025

న్యూజిలాండ్‌తో ట్రేడ్ డీల్.. భారత్‌కేంటి లాభం?

image

భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన <<18638346>>ఫ్రీ ట్రేడ్ డీల్<<>> వల్ల ఇక్కడి నుంచి వెళ్లే అన్ని వస్తువులపై అక్కడి మార్కెట్‌లో సుంకాలు ఉండవు. టెక్స్‌టైల్స్, జువెలరీ, ఇంజినీరింగ్ రంగాలకు ఇది ఎంతో లాభదాయకం. IT, హెల్త్‌కేర్‌తో పాటు యోగా, ఆయుష్ వంటి రంగాల్లోని ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు వీసా లభిస్తుంది. మన ఫార్మా కంపెనీలకు సులభంగా అనుమతులు వస్తాయి. 15 ఏళ్లలో NZ ఇక్కడ 20 బి.డాలర్ల పెట్టుబడులు పెడుతుంది.