News March 18, 2024

రెండో రోజు కవిత ఈడీ విచారణ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ్టి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.

Similar News

News September 8, 2025

కుల్గాం ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికుల వీరమరణం

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

News September 8, 2025

‘ఆమె లేని లోకంలో నేను ఉండలేను’.. ప్రియుడి సూసైడ్

image

TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 8, 2025

గాయం నుంచి కోలుకుంటున్న పంత్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఆయన అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి మరింత వేగంగా కోలుకునేందుకు పంత్ వైద్య నిపుణులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ విసిరిన బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో ఆయన విలవిల్లాడుతూ వెంటనే మైదానాన్ని వీడారు.