News September 28, 2024
రెండో రోజు ప్రారంభం కాని ఆట!

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కాన్పూర్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. కాగా నిన్న కూడా వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
Similar News
News December 5, 2025
వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.
News December 5, 2025
క్షమాపణ కోరిన రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.


