News August 4, 2024
రెండో వన్డే: భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో 40, వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40, కుశాల్ 30 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అక్షర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే IND 50 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.
Similar News
News March 4, 2026
ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?
News March 4, 2026
దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

దేశంలో వైట్ కాలర్ జాబ్స్ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.
News March 4, 2026
ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.


