News March 28, 2024

నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

image

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. జమ్మూకశ్మీర్‌లో APR 6న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, మిగతా రాష్ట్రాల్లో 5వ తేదీనే స్క్రూటినీ నిర్వహిస్తారు. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, యూపీ, బెంగాల్, మణిపుర్, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News March 13, 2026

నేటి నుంచి మరోసారి థియేటర్లలో ‘ధురంధర్’

image

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వెయ్యికి పైగా స్క్రీన్లలో 1250కి పైగా షోలు వేయనున్నట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై రూ.1350కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్-2’ ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కానుంది.

News March 13, 2026

మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.

News March 13, 2026

ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్‌‌ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌‌కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్‌కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.