News November 26, 2024

త్వరలో రెండో దశ మెట్రో పనులు: NVS రెడ్డి

image

TG: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ సూచనలతో ముందుకు వెళ్తామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానంలో HYD ఉందని.. వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

Similar News

News December 2, 2025

రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.

News December 2, 2025

శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

image

‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు <<18427442>>భారత్ సాయం<<>> అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

image

దిత్వా తుఫాన్‌ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.