News July 14, 2024
ఈనెల 16న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి రెండో పాట

రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఈనెల 16న రెండో పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ‘మార్ ముంత చోడ్ చింత’ అంటూ ఈ పాట సాగనుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘స్టెప్మార్’ సాంగ్ యూత్ను ఆకట్టుకుంది.
Similar News
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్లో రిలీఫ్ కోసం ఇలా టూర్లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.
News November 9, 2025
భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్లో భారీ డిమాండ్తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.


