News October 29, 2024
తెలుగు టైటాన్స్ రెండో విజయం
పాట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచులో రెండు (28-26) పాయింట్ల తేడాతో గెలుపొందింది. TTలో అశిష్ నర్వాల్ 9, పవన్ షెరావత్ 5 పాయింట్లు చేశారు. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ఇది రెండో విజయం.
Similar News
News January 3, 2025
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జనవరి 10-19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
News January 3, 2025
వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP
TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.
News January 3, 2025
Stock Markets: ఒక్కరోజు మురిపెం!
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 24,090 (-104), సెన్సెక్స్ 79,517 (-422) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. PSU BANK, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. ONGC, TRENT, SHRIRAMFIN, TITAN, NTPC టాప్ గెయినర్స్. నిఫ్టీ ADV/DEC 20:30.